IND vs ENG | జైశ్వాల్ మెరుపు సెంచరీ.. భారీ ఆధిక్యంలో భారత్.. 

-

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్టులో రోహిత్ సేన పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఓవర్‌ నైట్ స్కోర్ 207/2 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు హైదరాబాదీ సిరాజ్ షాక్ ఇచ్చాడు. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్లను కట్టడి చేశాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్‌కు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఇండియా బౌలర్లలో జడేజా, కుల్‌దీప్ చెరో రెండు వికెట్లు.. అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు.

- Advertisement -

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ ఇంగ్లాండ్ బౌలర్లు విరుచుకుపడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 122 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయంటే మనోడి ఊచకోత ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు శుభమన్‌ గిల్ కూడా 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే నాటికి 196/2 పరుగులు చేసింది. దీంతో భారత్ మొత్తంగా 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...