IND vs ENG | రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన 3-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా టీమిండియా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఒకానొక సమయంలో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టా్ల్లో పడింది. కానీ శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచారు. యశస్వి జైస్వాల్ కూడా 37 పరుగులతో రాణించాడు.
IND vs ENG | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ సెంచరీతో అలరించాడు. అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 307 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ 77, జురెల్ 90 పరుగులతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టును భారత బౌలర్లు దెబ్బకొట్టారు. దీంతో 145 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత్ విజయం కోసం 192 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక చివరిదైన ఐదో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి జరగనుంది.