IND vs IRE | ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 02-00తో సిరీస్‌ను దక్కించుకున్నది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. మెక్‌కార్తికి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసి ఓడింది. బల్బిర్నీ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72) పోరాడాడు. ప్రసిద్ధ్, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రింకూ సింగ్ నిలిచాడు.
IND vs IRE | ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58 పరుగులు), సంజూ శాంసన్ (26 బంతుల్లో 40 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. ఇక తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాట్ చేతపట్టిన రింకూ సింగ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) సూపర్ ఫినిషింగ్‌తో తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.