ICC టెస్టు టీమ్ ర్యాంకింగ్స్(ICC Test Ranking)లో టీమ్ ఇండియా తిరిగి అగ్రస్థానాన్ని అధిరోహించింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టి రోహిత్ సేన నంబర్.1 ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ఐసీసీ మంగళవారం వార్షిక టీమ్ ర్యాంక్‌లను ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లతోపాటు 2020 మే నుంచి 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా ఐసీసీ పరిగణలోకి తీసుకుని ఐసీసీ ర్యాంక్‌లను వెల్లడించింది. 2020-22 మధ్యలో జరిగిన సిరీస్‌లకు 50 శాతం.. ఆ తర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయించినట్టు ఐసీసీ పేర్కొంది. దాంతో టీమ్ ర్యాంకింగ్స్‌లో మార్పులు జరిగాయి. టీమ్ ఇండియా 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని సాధించింది.
ICC Test Ranking |2020-22 మధ్య జరిగిన సిరీస్‌ల్లో తక్కువ వెయిటేజ్ లభించడంతోపాయింట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా.. 116 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ నుంచి రెండో స్థానానికి పడిపోయింది. దాంతో 15 నెలల తర్వాత కంగారుల జట్టు నం.1 స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్(114) మూడో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా(104), న్యూజిలాండ్(100) వరుసగా నాలుగు, ఐదు స్థానాలో నిలిచాయి. కాగా, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు నం.1 స్థానాన్ని పొందడం టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచినట్టైంది. ఇంగ్లాండ్‌లో జూన్ 7 నుంచి 11 తేదీల మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Read Also: ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాల భర్తీకి ఐబీఎం సిద్ధం!
Follow us on: Google News, Koo, Twitter