న్యూజిలాండ్(New Zealand), భారత్(India) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో న్యూజిలాండ్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ వాతావరణంలో వస్తున్న మార్పులు చూస్తుంటే ఈ మ్యాచ్ డ్రా అవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ లక్ష్యం 107 పరుగులుగా ఉంది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి న్యూజిలాండ్ ప్లేయర్లు రంగంలోకి దిగి నాలుగు బంతులు ఆడారు అంతే.. ఇంతలోనే వరుణుడు కూడా రంగంలోకి దిగేశాడు.
ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం పడటం మొదలైంది. దీంతో మ్యాచ్‌ను అక్కడే ఆపి ప్లేయర్లు పెవిలియన్ చేరుకున్నారు. స్టేడియం సిబ్బంది కవర్లతో మైదానాన్ని కప్పారు. కొద్దిసేపటికే ఈరజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క పరుగు కూడా చేయలేదు. రేపు ఒక్కరోజు మ్యాచ్‌కు మిగిలి ఉంది. దీంతో న్యూజిలాండ్(New Zealand)కు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతా అంటున్నారు. 107 పరుగులు పెద్ద లక్ష్యం కాదని, కాస్తంత కాన్సన్‌స్ట్రేట్ చేస్తే బౌలర్లు బాదేస్తారని అంటున్నారు. కానీ రేపు కూడా వర్షం పడి రద్దయితే మాత్రం రిజల్స్ట్ వేరేలా ఉండొచ్చు.
ఈరోజు ఆటలో భారత బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz khan) 195 బంతుల్లో 150 పరుగులు సాధించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రిషబ్ పంత్ కూడా 105 బంతుల్లో 99 పరుగులు చేసి సర్ఫరాజ్‌కు మంచి పార్ట్‌నర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కోహ్లీ 70, రోహిత్ 52, జైశ్వాల్ 32, కేఎల్ రాహుల్ 12, జడేజా 5, అశ్విన్ 15 పరుగులు చేశారు. కివీస్ బౌలర్ల కొత్త బంతిని తీసుకున్న తర్వాత భారత్ వికెట్లు వరుసబెట్టి పడ్డాయి. కొత్త బంతి వచ్చిన తర్వాత భారత్ కేవలం 62 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.