ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్ల రికార్డ్

-

ప్యారిస్ ఒలిపింక్స్‌(Paris Olympics) టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో భారత్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రీక్వార్టర్స్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. రొమేనియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో గెలిచింది. దీంతో మనికా బాత్రా(Manika Batra), ఆకుల శ్రీజ(Akula Sreeja), అర్చనా కామత్‌(Archana Girish Kamath) ట్రియో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. అయితే ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారత టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. దీంతో రోమేనియాపై టీమిండియా సాధించిన విజయం చారిత్రాత్మకంగా మారింది.

- Advertisement -

Paris Olympics | తొలుత టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్ జోడీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు గేమ్‌లలో కూడా 11-9, 12-10, 11-7 తో డయాకోను, సమర ఎలిజబెటాను చిత్తు చేశారు. ఆ తర్వాత సింగిల్స్‌లో మనికా బాత్రా చెలరేగి.. 11-5, 11-7, 11-7తో బెర్నాడెట్టేను మట్టికరిపించింది. ఆ తర్వాత పుంజుకున్న రొమేనియా.. రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి 2-2తో స్కోరును సమం చేసింది. అసలు ఫలితాన్ని తేల్చే ఐదో మ్యాచ్‌లో మనికా.. 11-5, 11-9, 11-9 తో సునాయసంగా గెలిచింది.

Read Also: యూరిక్ యాసిడ్ సమస్యకు వీటితో చెక్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...

న్యూ ఇయర్ వేడుకలు.. గీత దాటితే తాట తీస్తామంటోన్న పోలీసులు

New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు...