చెస్ ఒలింపియాడ్(Chess Olympiad)లో భారత్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరి తర్వాత ఒకరిని ప్రత్యర్థులను చిత్తు చేస్తూ భారత్ దూసుకెళ్తోంది. టోర్నీలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ భారత పురుషులు, మహిళ జట్లు తమ ఆరో విజయాన్ని సాధించాయి. సోమవారం భారత పురుషుల జట్టు హంగేరీ పురుషుల జట్టుతో పోటీ పడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది.జుగిరోవ్ సనమ్, అర్జున్ ఇరిగేశి మధ్య నువ్వానేనా అన్న పోటీ నెలకొంది. ఇందులో అర్జున్(Arjun Erigaisi) అద్భుత విజయం సాధించాడు. అదే విధంగా బెంజమిన్‌తో తలపడిన విదిత్ గుజరాతి కూడా గెలిచారు. రిజర్డ్‌తో గేమ్‌ను గుకేష్, పీటర్ లెకోతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా అయ్యాయి.
Chess Olympiad | మరోవైపు మహిళలు కూడా అదరగొట్టారు. ఆర్మేనియాతో పోటీ పడిన భారత మహిళల జట్టు 2.5-1.5 తేడాతో గెలిచింది. ఎలీనాతో తలపడిన దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh) 40మూవ్స్‌లో ఆటను ముగించింది. లిలిత్ గేమ్‌ను ద్రోణవల్లి హారిక, మరియంతో గేమ్‌ను వైశాలి, అనాతో గేమ్‌ను తానియా సచిన్‌దేవ్ డ్రాగా ముగించారు.