Asia cup: ఇండియా వర్సెస్ పాకిస్థాన్..ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

0
134

ఆసియా కప్ లో భాగంగా నేడు పాక్ ఇండియా అమితుమీకి సిద్ధమవుతున్నాయి. దేశం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ జట్ల మధ్య  జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ 2012 మార్చి 18న పాకిస్థాన్‌పై 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్‌లో ఓ బ్యాటర్​ చేసిన అత్యధిక స్కోరు ఇదే.

పాకిస్థాన్ చివరిసారిగా మార్చి 2014లో భారత్‌పై ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఓ వికెట్ తేడాతో విజయం సాధించింది. అశ్విన్ వేసిన ఓవర్లో షాహిద్ అఫ్రిది రెండు సిక్సర్లు బాది పాక్ జట్టుకు విజయాన్ని అందించాడు.

2016, ఫిబ్రవరి 27 జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌పై కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్‌లో భారత్‌పై పాక్ జట్టు సాధించిన కనిష్ట స్కోరు ఇదే.

ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఇప్పటివరకు 300+ పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టు అత్యధిక స్కోరు 329 పరుగులు. ఈ స్కోర్లు వన్డే ఫార్మాట్‌లో నమోదయ్యాయి.

రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 61.16 బ్యాటింగ్ సగటు, 92.44 స్ట్రైక్ రేట్‌తో 367 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.