ఆసియా ఛాంపియన్ ట్రోఫీ(Asian Champions Trophy)లో భారత అమ్మాయిల హాకీ(Hockey) జట్టు అదరగొట్టింది. ప్రారంభం నుంచి కూడా ఓటమి తెలియని జట్టులా వీరవిహారం చేసింది. ఆఖరుకు ట్రోఫీని కైవసం చేసుకుని శభాష్ అనిపించుకుంది. బుధవారం చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1.0తో డ్రాగన్ కంట్రీని చిత్తు చేసింది. మ్యాచ్ 31వ నిమిషయంలో దీపిక గోల్ చేసి భారత్‌కు లీడ్ అందించింది. మ్యాచ్ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా రెండు జట్లు సున్నా స్కోర్‌తో హోరాహోరీగా పోరాడాయి. దీంతో మ్యాచ్ సెకండ్ ఆఫ్ మరింత రసవత్తరంగా మారింది. ఎవరు పైచేయి సాధిస్తారని ప్రేక్షకులంతా కూడా సీటు అంచుల్లో కూర్చుని చూడటం ప్రారంభించారు. ఎట్టకేలకు దీపిక గోల్ చేసి భారత్‌ను ముందుకు తీసుకెళ్లింది. అదే విధంగా ఆ గోల్ సమం చేసే అవకాశం చైనా(China)కు ఇవ్వకుండా అత్యద్భుతంగా డిఫెండ్ చేసింది భారత్.
కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. వాటిని గోల్స్‌గా మలవడంలో భారత్ తీవ్ర నిరాపరిచింది. వీటిలో మూడో పెనాల్టీ కార్నర్‌ను మాత్రం దీపిక గోల్‌గా మలిచింది. అలా జరిగి ఉండకుంటే ఈ ఫైనల్ మ్యాచ్ టైగా మారి ఉండేది. ఆ తర్వాత మ్యాచ్ సెకండ్ ఆఫ్ మొత్తం కూడా చైనా.. స్కోర్‌ను సమం చేయడంపైనే దృష్టి పెట్టింది. కానీ కుదరలేదు. ఆసియా ఛాంపియన్ ట్రోఫీ(Asian Champions Trophy) టైటిల్‌ను దక్కించుకోవడం భారత్‌కు ఇది మూడోసారి.