India vs australia: ఆస్ట్రేలియా టీమ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఆసిస్ ను ఓడించింది. ఆసీస్ పై ఇన్నింగ్స్ లో 132 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అశ్విన్ 5, జడేజా 2, షమీ 2 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు. స్కోర్లు: ఆస్ట్రేలియా 177/10, 91/10, భారత్ 400/10