IND vs ENG | ఐదో టెస్టులో భారత్ ఘ‌న విజ‌యం.. 4-1తో సిరీస్ కైవసం..

-

యువ భారత్ అదరగొట్టింది. ధ‌ర్మశాల వేదిక‌గా ఇంగ్లాండ్‌ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 259 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టును 195 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్లలో జోరూట్ (84), జానీ బెయిర్ స్టో (39), టామ్‌హార్డ్లీ(20)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. జాక్‌క్రాలీ (0), బెన్‌డ‌కెట్ (2), బెన్ స్టోక్స్ (2), బెన్ ఫోక్స్ (8), ఓలీపోప్ (19)లు విఫ‌లమయ్యారు. . భార‌త బౌల‌ర్లలో ర‌విచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

- Advertisement -

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 473/8 ప‌రుగుల‌తో మూడో రోజు మొద‌టి ఇన్నింగ్స్ కొన‌సాగించిన భార‌త్ కు మ‌రో నాలుగు ప‌రుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 110, శుభమన్ గిల్ 103, జైశ్వాల్ 57, పడిక్కల్ 67, సర్ఫరాజ్ ఖాన్ 54 పరుగులతో రాణించారు. కుల్దీప్‌ను ఔట్ చేసిన అండర్సన్‌ టెస్టుల్లో 700 వికెట్లు తీసి తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇక 100వ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించాడు. ఇక ఇంగ్లాండ్ బౌల‌ర్లలో షోయ‌బ్ బ‌షీర్ ఐదు వికెట్లు తీశాడు. కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1తేడాతో గెలుచుకుంది. తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా వరుసగా నాలుగు టెస్టులు గెలిచి చరిత్ర నెలకొల్పింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...