ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV Sindhu) మెరిసింది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి ప్రేక్షకుల ఆశలను చిగురింపజేసింది. గురువారం జరిగిన మహిళల ప్రీక్వార్టర్స్‌లో 18-21, 21-12, 21-16 తేడాతో చైనాకు చెందిన హాన్ యూను సింధు చిత్తు చేసింది. నాలుగో సీడ్ హాన్ యూతో మొదలైన మ్యాచ్ 63 నిమిషాల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో సింధు అద్భుతమైన ప్రదర్శన చూపింది. ఈ మ్యాచ్‌లో సింధు తన దూకుడు ఆటతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. తొలి గేమ్ నువ్వా నేనా అన్నట్లు సాగినా సింధూనే పైచేయి సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే సింధూ చెలరేగింది. మూడో గేమ్ మరోసారి ఉత్కంఠ భరితంగా మారింది. అప్పటికే మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయినా.. మూడో గేమ్‌లో సత్తా చాటాలని హాన్ యూ కూడా తెగ తాపత్రయపడింది.
మూడో గేమ్‌లో 16 పాయింట్ల వరకు కూడా ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు ఆడారు. అక్కడి వరకు ఇద్దరి స్కోరు సమమవుతూనే వచ్చింది. ఒకరు ఒక పాయింట్ స్కోర్ చేస్తే వెంటనే ప్రత్యర్థికి కూడా తాను తక్కువ కాదన్నట్లు ఆ స్కోర్‌ను సమం చేయడంతో మూడో గేమ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. 16 పాయింట్ల దగ్గర సింధు ఒక్కసారిగా గేర్ మార్చేసి వరుసగా 5 పాయింట్లు చేసింది. దాంతో అప్పటి వరకు హాన్ యూ చేసిన తీవ్ర పోరాటం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. దీంతో హాన్ యూతో సాగిన మ్యాచ్‌ను 7-1 తేడాతో సింధు(PV Sindhu) అదరగట్టేసింది.