పారాలింపిక్స్(Paralympics)లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. భారత్‌కు వరుస పతకాలు తీసుకొస్తున్నారు. తాజాగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ఆటగాడు నవదీప్(Navdeep Singh).. స్వర్ణం సాధించాడు. తొలుత రెండో స్థానంలో ఉండి సిల్వర్ పతకాన్ని దక్కించుకున్న నవదీప్ కొన్ని అనూహ్య పరిణామాలతో స్వర్ణాన్ని కౌవసం చేసుకున్నాడు. జావెలిన్ త్రో ఎఫ్-41లో తొలుత ఇరాన్ ప్లేయర్ స్వర్ణం గెలుచుకున్నాడు. అప్పుడు భారత ప్లేయర్ నవదీప్ రెండో స్థానంలో నిలిచాడు.
ఇంతలో ఇనార్ ప్లేయర్‌పై అనర్హత వేటు పడటంతో సీన్ అంతా మారిపోయింది. ఈ కారణంగానే నవదీప్ రెండో స్థానం నుంచి తొలి స్థానానికి చేరుకున్నాడు. స్వర్ణం సొంతం చేసుకున్నాడు. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో పసిడి పతకం సాధించిన తొలి ప్లేయర్‌గా నవదీప్(Navdeep Singh) అరుదైన రికార్డ్ నమోదు చేశాడు.