Cameron Green reacts after being second most expensive player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 (IPL-2023) రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఎన్నడూ లేనివిధంగా డబ్బులు కుమ్మరించాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ సామ్ కరన్‌ను పంజాబ్ జట్టు రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ని ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లకు దక్కించుకుంది.
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ధరకు అమ్ముడుపోవడంపై కామెరూన్(Cameron Green) స్పందించాడు. అంత రేటు పలకడానికి తాను పెద్దగా ఏమి చేయలేదని అన్నాడు. ఆదరణ కలిగిన లీగ్‌లో తన పేరును చేర్చానని తర్వాత ఇది జరిగిపోయిందని తెలిపాడు. ఐపీఎల్‌లో భారీ ధర రావడం ప్రత్యేక అనుభూతిని ఇస్తోందని అన్నాడు. దీనిని చాలా కాలం పాటు మరిచిపోలేనని పేర్కొన్నాడు. తొలిసారిగా ఐపీఎల్ వేలంలో పాల్గొన్న ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జట్లు పోటీ పడ్డాయి. చివరికి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక రేటు పలికిన రెండో ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.