IPL 2023 |ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఎమ్‌ఎస్ ధోని సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే అదరగొట్టారు.
IPL 2023 |నిర్ణీత 20 ఓవర్లలో 4 బంతులు మిగిలి ఉండగానే.. 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది గుజరాత్. శుభ్‌మన్ గిల్ 63, విజయ్ శంకర్ 27, వృద్ధిమాన్ సాహా 25, సాయి సుదర్శన్ 22, రాహుల్ తెవాటియా 15, చివర్లో మూడు బంతుల్లో 10 పరుగులు చేసిన రషీద్ ఖాన్ విజృంభించి ఆడటంతో గుజరాత్‌కు సునాయాసం అయింది. ఇక చెన్నై తరపున ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ అత్యధికంగా 92 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మొయిన్ అలీ 23 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలో 2 వికెట్లు తీశారు. ఇక చెన్నై బౌలర్లలో రాజ్‌వర్ధన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ తీసుకున్నారు.
Read Also: IPL ఫ్రారంభ వేడుకలో అదరగొట్టిన తమన్నా, రష్మిక
Follow us on: Google News, Koo, Twitter