IPL 2023 Retention: అరెరే.. కీలక ప్లేయర్లను వదిలేసిన ఫ్రాంఛైజీస్‌!

-

IPL 2023 Retention details: రానున్న ఐపీఎల్‌లో భారీ మార్పులు చూడబోతున్నాం. ఆయా జట్టులలో ఉన్న కీలక ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు వదిలేశాయి. భారత టీ 20 లీగ్‌లో ఫ్రాంఛైజీల పరస్పర అంగీకారంతో ఆటగాళ్ల మార్పడి జరిగింది. తాజాగా తమ వద్ద అట్టిపెట్టుకున్న క్రీడాకారులను, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. రిటెన్షన్‌ ప్రక్రియకు నవంబర్‌ 15 వరకు మాత్రమే బీసీసీఐ గడువు ఇవ్వటంతో.. అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటైనింగ్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ అత్యధికంగా 16 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలివేసింది. ఆ తరువాత ముంబై ఇండియన్స్‌ 13 మంది ఆటగాళ్లను వదిలేసినట్లు ప్రకటించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 12 మంది ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది.

- Advertisement -

కెప్టెన్‌ను వదిలేసిన హైదరాబాద్‌
గత సీజన్‌ పేలవ ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ మార్పులు చేపట్టింది. కెప్టన్‌గా వ్యవహరించిన కేన్‌ విలియమ్సత్‌ పాటు జట్టులో సీనియర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌, జగదీశ్‌ సుచిత్‌తో పాటు ప్రియమ్‌ గార్గ్‌, రవికుమార్‌ సమర్థ, రొమారియో షెఫెర్డ్‌, సౌరభ్‌ దూబె, సీని్‌ అబాబ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, సుషాంత్‌ మిశ్రా, విష్ణు వినోద్‌ను వదిలేసినట్లు ప్రకటించింది. దీంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ.42.25 కోట్ల పర్స్ మిగిలి ఉంది.

పొలార్డ్‌ను విడుదల చేసిన ముంబై
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు గత సీజన్‌లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో జట్టులో కీలక మార్పులు చేసేందుకు ఫ్రాంఛైజీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సీనియర్‌ బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను వదిలేసింది. పొలార్డ్‌తో పాటు అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, ఆర్యన్‌ జుయల్‌, బసిల్‌ థంపి, డానియల్‌ సామ్స్‌, ఫాబియన్‌ అలెన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మయాంక్‌ మార్కండే.. మురుగన్‌ అశ్విన్‌, రాహుల్‌ బుద్ధి, రిలీ మెరెడిత్‌, సంజయ్‌ యాదవ్‌, టైమల్‌ మిల్స్‌ను వేలంలోకి విడిచిపెట్టినట్లు ముంబై జాబితాను వెల్లడించింది. దీంతో ముంబై ఇండియన్స్‌ వద్ద రూ.20.55 కోట్లు పర్సు మిగిలి ఉంది.

చైన్నై జట్టులో మార్పులు
చైన్నై జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. డ్వేన్‌ బ్రావ్‌ను వదిలేసినట్లు చైన్నై ప్రకటించింది. అతడితో పాటు ఆడమ్‌ మిల్నే, క్రిస్‌ జొర్డాన్‌, ఎన్‌ జగదీశన్‌, సి హరినిశాంత్‌, కే భగత్‌ వర్మ, కేఎం అసిఫ్‌, రాబిన్‌ ఉతప్పను విడుదల చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైన్నై వద్ద రూ. 20.45 కోట్ల పర్స్‌ మిగిలి ఉంది.

ఇక ఇతర జట్ల విషయానికి వస్తే, లఖ్‌నవూ ఆండ్రూ టై, అంకిత్‌ రాజ్‌పుత్‌, దుష్మంత చమీర, ఇవిన్‌ లూయిస్‌, జాసన్‌ హోల్డర్‌, మనీష్‌ పాండే, షహబాద్‌ నదీమ్‌ను విడుదల చేసింది. బెంగళూరు పెద్ద ఆటగాళ్లను విడుదల చేయలేదు. జాసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, చమ మిలింద్‌,లవ్‌నిత్‌ సిసోదియా, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌ను వదులుకుంది.

ఇక రాజస్థాన్‌ విషయానికి వస్తే, ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ను రాజస్థాన్‌ వదిలేసింది. అరుణయ్‌ సింగ్‌, కార్బిన్‌ బాస్క్‌, డారిల్‌ మిచెల్‌, కరుణ్‌ నాయర్‌, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, శుభమ్‌ గర్హ్వాల్‌, తేజ్‌ బరోకలను వేలంలోకి వదిలేసింది.

కోల్‌కతాలో కీలక ఆటగాళ్లైన ప్యాట్‌ కమిన్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, అమన్‌ ఖాన్‌, శివమ్‌ మావి, మహమ్మద్‌ నబి, చనిక కరుణరత్నె, ఆరోన్‌ ఫించ్‌, అరెల్స్‌ హేల్స్‌, అభిజిత్‌ తోమర్‌,అజింక్య రహానె, అశోక్‌ శర్మ, బాబా ఇంద్రజిత్‌, పార్థుమ్‌ సింగ్‌, రమేశ్‌ కుమార్‌, రసిఖ్‌ సలామ్‌, షెల్డన్‌ జాక్సన్‌లు వదిలేసుకుంది.

పంజాబ్‌ అయితే మయాంక్‌ అగర్వాల్‌, ఓడియన్‌ స్మిత్‌, వైభవ్‌ అరోరా, బెన్నీ హోవెల్‌, ఇషాన్‌ పోరెల్‌, అన్ష్‌ పటేల్‌, ప్రేరక్‌ మన్కడ్‌, సందీప్‌ శర్మ, వృత్తిక్‌ ఛటర్జీని విడుదల చేసింది.
గుజరాత్‌ జాసన్‌ రాయ్‌, రహమ్మనుతుల్లా గుర్బాజ్‌, లాకీ ఫెర్గూసన్‌, డొమినిక్‌ డ్రాక్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, వరుణ్‌ అరోన్‌ను వదులుకుంది.

ఢీల్లీ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ను విడుదల చేసి పెద్ద షాక్‌ ఇచ్చింది. షార్దూల్‌తో పాటు టిమ్‌ సీఫెర్ట్‌, అశ్విన్‌ హెబ్బర్‌, శ్రీకర్‌ భరత్‌, మన్‌దీప్‌ సింగ్‌ను వేలంలోకి విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...