ఐపీఎల్-18 కర్టెన్ రైజర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఘనవిజయంతో ప్రారంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను(KKR) హోం గ్రౌండ్స్‌లో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫిల్ సాల్ట్(Phil Salt) చిచ్చరపిడుగుల్లా అదరగొట్టారు. మ్యాచ్ గెలవడం తర్వాత ముందు వీళ్లిద్దరి ఆపాలన్న రేంజ్‌లో కోల్‌కతా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఆర్‌సీబీ తన ఆధిపత్యం కనబరిచింది. కోల్‌కతా ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ మూడు వికెట్లు కోల్పోయి.. 16.2 ఓవర్లలోనే ఛేదించింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 174 పుగులు చేసింది. కెప్టెన్ రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లకు అతిపెద్ద ఛాలెంజ్‌గా నిలిచాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి టీమ్‌కు ఊపందించాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ 22 బంతుల్లో 30 పరుగులు చేసి రాణించాడు. మిగిలిన బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3, హేజిల్ వుడ్ 2, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.
కోల్‌కతా అందించిన 175 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఆర్‌సీబీ పరుగుల వరద పారించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 36 బంతుల్లో 56 పరుగులు చేసి వెనుదిరిగాడు. వీరిద్దరు అర్థసెంచరీలతో మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.