ఐపీఎల్ ఫ్యాన్స్ కు పండగే..ఇక నుంచి ఐసీసీ ప్రత్యేక షెడ్యూల్​!

0
148

గత రెండు మూడు రోజులుగా ఐపీఎల్ వార్తల్లో నిలుస్తుంది. వచ్చే ఐదేళ్లకుగాను మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఐపీఎల్ ఇలా పూర్తయిందో లేదో ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది బీసీసీఐ.

టోర్నీలోని మ్యాచ్​ల సంఖ్యను కూడా 94కు పెంచడమే కాకుండా ఐపీఎల్​ కోసం ఐసీసీ క్యాలెండర్​లో ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయిస్తున్నట్లు తెలిపింది. దీనితో ఐపీఎల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏటా ఐపీఎల్​లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా.. ముందుగా ఉన్న షెడ్యూల్స్​ కారణంగా కొంతమంది ఐపీఎల్​ను మిస్​ అవుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్​ జట్టులో లేడని ఫ్యాన్స్​ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇప్పుడు ఆ లోటును కూడా బీసీసీఐ భర్తీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకపై కేవలం ఐపీఎల్​ కోసం అన్ని క్రికెట్​ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్​ క్లియరైంది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్​లో ఐపీఎల్​ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.