స్టార్ ప్లేయర్లకు బిగ్ షాకిచ్చిన IPL నిర్వాహకులు

-

ఐపీఎల్ మ్యాచులు రసవత్తరంగా మారుతున్నాయి. ఊహించిన దానికంటే రంజుగా ఉంటున్నాయి. చివరి నిమిషం ఉత్కంఠతో కొనసాగి.. అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు అయిన నితిష్ రాణా, సూర్యకుమార్ యాదవ్‌పై ఐపీఎల్ యాజమాన్యం సీరియస్ అయింది. వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 16వ(ఆదివారం) తేదీన కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో 14 బంతులుండగానే ఛేదించింది. అయితే అద్బుతమైన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌కు అంపైర్ల షాకిచ్చారు. అతనికి జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో సరైన సమయానికి ముంబై ఇండియన్స్ ఓవర్లను ముగించడంలో విఫలమైంది.

- Advertisement -

దీంతో అంపైర్లు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. అంతేగాక, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు కూడా ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో 10 బంతులు ఆడిన నితీష్ రాణా కేవలం 5 పరుగులే చేశాడు. బౌలర్ హృతిక్ షోకిన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఈ సమయంలో హృతిక్ యాటిట్యూడ్ చూపించాడు. రాణాను అవుట్ చేసి అతనికి ప్రత్యేక సైగలు చేశాడు. దీంతో ఆగ్రహించిన నితీష్ రాణా.. హృతిక్‌తో వాగ్వాదానికి దిగి.. బూతులు తిట్టేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు.. నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హృతిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధిస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...