T20 World Cup 2022: ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

-

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సూపర్‌ 12లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. డక్‌ వర్త్‌ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 19.2 ఓవర్లకు 157 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 14.3 ఓవర్లకు 105/5 స్కోర్‌ చేసింది. ఈక్రమంలో వర్షం కురవడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

- Advertisement -

ఐర్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ బాల్‌బిర్ని 62, టక్కర్‌ 34 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ మలన్‌ 35 పరుగులు చేయగా.. మొయిన్‌ అలీ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బాల్‌బిర్నికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ ను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. గతంలో 2011 వన్డే ప్రపంచ కప్‌‌లో తొలిసారి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ టీమ్‌‌ను దెబ్బకొట్టింది. కాగా.. టీ20 వరల్డ్ కప్‌‌ (T20 World Cup 2022) లో ఓడించడం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...