ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా బోర్డు తమను అసలు పట్టించుకోవట్లేదని తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశాడు. రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై(Border Gavaskar Trophy) చూపుతున్న ఇంట్రస్ట్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. తమ జట్టుతో జరుగుతున్న సిరీస్‌పై చూపట్లేదని అన్నారు. అయితే దాదాపు 12ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్థాన్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇది పాక్‌కు చాలా పెద్ద ఫీట్ అయినప్పటికీ దీనిపై తగిన ప్రచారం జరగలేదు. ఈ అంశంపై స్పందిస్తూనే జెసన్ ఘాటుగా స్పందించాడు.
‘‘నిజం చెప్పాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) ద్వారా మా వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రచారం జరగలేదు. ఇది ఒంకింత ఆశ్చర్యకరంగా ఉంది. ఆస్ట్రేలియా వాళ్లు భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ టెస్ట్ సిరీస్‌పైనే ఆస్ట్రేలియా ఫోకస్ అంతా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. దేనికి ప్రచారం చేయాలి అన్నది ఆస్ట్రేలియా క్రికెట్ ఇష్టం. కానీ.. ఒక దేశంతో ఆడుతున్న ప్రచారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిరాశగా ఉంటుంది. నేనయితే పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌కు సంబంధించి ఒక్క ప్రకటన కూడా చూడలేదు’’ అని జేసన్(Jason Gillespie) అన్నాడు.