టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 6 వికెట్లతో రాణించారు. ఇక విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 881 పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచంలోనే మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి బౌలర్‌గా బుమ్రా(Jasprit Bumrah) చరిత్ర నెలకొల్పాడు. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన రెండో ఆసియా ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. ఇక టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్‌గానూ నిలిచాడు.
ఇదిలా ఉంటే ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న నాలుగో భారత ఆటగాడిగానూ అవతరించాడు. అంతకుముందు అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ.. నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నారు. అయితే బుమ్రా మినహా మిగతా ముగ్గురూ స్పిన్నర్లే కావడం గమనార్హం.