ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ICC) కొత్త ఛైర్మాన్ ఎంపిక పూర్తయింది. ఈ ఎన్నిక ప్రక్రియ లాంఛనప్రాయంగా మారింది. ఈ పదవికి బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జేషా(Jay Shah) ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. డీసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు రెండేళ్ల పాటు జేషా.. ఐసీపీ ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. బీసీసీఐలో కూడా జేషా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 35 ఏళ్లు ఉన్న జేషా.. ఏకగ్రీవంగా ఎన్నికై.. సరికొత్త రికార్డ్ కూడా సృష్టించారు. ఐసీసీ చరిత్రలో ఛైర్మన్ పదవికి ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా జేషా నిలిచారు. భారత్ నుంచి ఐసీపీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తి కూడా జేషానే. ప్రస్తుతం గ్రెగ్ బార్క్‌లే ఈ పదవిలో కొనసాగుతున్నారు. మరో దఫా అదే పదవిలో కొనసాగడానికి ఆయనకు అవకాశం ఉన్నప్పటికీ అందుకు గ్రెగ్.. విముఖత చూపారు. దీంతో ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో జేషా ఒక్కరు మాత్రమే నిలబడటంతో ఈ ఎన్నికలు లాంఛనప్రాయంగా మిగిలాయి. జేషా ఎంపిక ఏకగ్రీవం అయింది. అయితే జేషా(Jay Shah) ఏకగ్రీవ ఎంపికపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన బీసీసీఐ నుంచి పోటీలో ఉన్న కారణంగా.. తమ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిగిలిన వారిని పోటీలో నిలబడకుండా అడ్డుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీసీసీఐ తరపునుంచి పోటీలో ఉన్న వ్యక్తి ఛైర్మన్ అయితే అది ఐసీసీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆలోచించి మిగిలిన వారు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఐసీపీ ఛైర్మన్(ICC Chairman) ఎన్నికల్లో జేషా ఎంపిక పూర్తయింది.