ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్‌గా జై షా బాధ్యలు స్వీకరించారు. ఇటీవల ఐసీసీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో జై షా(Jay Shah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తిగా జై షా నిలిచారు. అంతేకాకుండా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా కూడా జై షా ఘనత సాధించారు.
ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్.. 2015-2020 మధ్య ఈ పదవిలో విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో గ్రెగ్ బార్క్‌లే కొనసాగారు. మరో దఫా అదే పదవిలో కొనసాగడానికి ఆయనకు అవకాశం ఉన్నప్పటికీ అందుకు గ్రెగ్.. విముఖత చూపారు. దీంతో ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో జై షా(Jay Shah) ఒక్కరు మాత్రమే నిలబడటంతో ఈ ఎన్నికలు లాంఛనప్రాయంగా మిగిలాయి. జేషా ఎంపిక ఏకగ్రీవం అయింది. అయితే జై షా ఏకగ్రీవ ఎంపికపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన బీసీసీఐ నుంచి పోటీలో ఉన్న కారణంగా.. తమ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిగిలిన వారిని పోటీలో నిలబడకుండా అడ్డుకున్నారన్న వాదనలు కూడా వినిపించాయి.
అంతేకాకుండా బీసీసీఐ(BCCI) తరపునుంచి పోటీలో ఉన్న వ్యక్తి ఛైర్మన్ అయితే అది ఐసీసీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆలోచించి మిగిలిన వారు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారన్న మాట కూడా వినిపించింది. ఏది ఏమైనా ఐసీపీ ఛైర్మన్(ICC Chairman) ఎన్నికల్లో జేషా ఎంపిక పూర్తయింది.