Kohli :కింగ్‌కు కోపం వచ్చింది!

-

Kohli :కింగ్‌ కోహ్లీకి కోపం వచ్చింది. అవునండి.. ఆయన మనిషే కదా.. తను కూడా కొంత ప్రైవసీ కోరుకుంటాడు కదా.. అసలు కోహ్లీ ఎందుకు కోప్పడ్డాడు.. అతడి ప్రైవసీకి ఏం భంగం వాటిల్లిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

టీ20 వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ లేని సమయంలో అతని హోటల్‌ గదిలోకి వెళ్లిన ఓ వ్యక్తి.. రూమ్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది కాస్తా వైరల్‌ కావటంతో.. ఈ వీడియో కింగ్‌ (Kohli) దృష్టికి వెళ్లింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటమేనని అసహనం వ్యక్తం చేశారు.

“అభిమాన క్రికెటర్లను చూసినప్పుడు అభిమానులు ఎగ్జైట్‌ అవుతారనీ, చాలా ఆనంద పడతారని నాకూ తెలుసు. ఫోటో దిగాలన్న ఉత్సుకత ఉంటారని తెలుసు. అటువంటి అభిమానాన్ని నేను కూడా అభినందిస్తా.. కానీ ఈ వీడియో మాత్రం నన్ను షాక్‌కు గురి చేసింది. ఇది నా పర్సనల్‌ ప్రైవసీకు భంగం కలిగించటమే. నా హోటల్‌ రూమ్‌లోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఏ ఒక్కరినీ వినోద వస్తువుగా చూడవద్దు “ అంటూ కోహ్లీ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

Kohli Hotel Room:  https://www.instagram.com/reel/CkXVWI6g7Ff/?igshid=MDJmNzVkMjY=

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...