ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి మెరిసన ఆటగాడు మయాంక్ యాదవ్(Mayank Yadav). అతడి పర్ఫార్మెన్స్ చూసి మయాంక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు కూడా అమాంతం అధికమయ్యాయి. ఆ దిశగా బీసీసీఐ కూడా ఆలోచన చేసింది. కానీ ఇంతలో గాయం కావడంతో మయాంక్.. మైదానానికి దైరమయ్యాడు. చాలా కాలంగా ఆటకు దూరమైన మయాంక్ ఇటీవల కోలుకుని తిరిగా ప్రాక్టీస్‌ను స్టార్ట్ చేశాడు. ఎలాగైనా వీలైనంత త్వరగా మైదానంలోకి అడుగు పెట్టాలని ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) నిర్వహిస్తోన్న స్పెషల్ క్యాంపులో మయాంక్‌కు బీసీసీఐ స్థానం కల్పించింది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా మయాంక్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ స్పెసల్ కేర్ తీసుకోవడం ప్రస్తుతం కీలకంగా మారింది. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసమే మయాంక్‌ను బీసీసీఐ సిద్ధం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
‘‘మయాంక్ తన గాయం నొప్పిగా ఉన్నట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి ఇప్పటి వరకు తీసుకురాలేదు. నెల రోజులుగా ఎన్‌సీఏలో బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు మయాంక్(Mayank Yadav) ఎంతవరకు సన్నద్ధమయ్యాడని తెలుసుకోవడానికి సెలక్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. NCA లో మయాంక్ కఠినంగా శ్రమిస్తున్నాడు. ఒక్కోరోజు మూడు స్పెల్స్‌లో 20 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను చెక్ చేసుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మయాంక్‌ను ఎంపిక చేసే అవకాశం ఎక్కువగానే ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు కూడా చెప్తున్నాయి.