భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్(Nikhat Zareen)కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. గోల్డ్ మెడల్ సాధించాక తొలిసారి నగరానికి వచ్చిన ఆమెను శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లి మరీ గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ వేణు గోపాల చారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, చంద్రా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, సుధాకర్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఓపెన్ టాప్ జీప్‌లో త్రివర్ణ పతాకాలతో నిఖత్(Nikhat Zareen)ను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తన పతకం, ట్రోఫీని చూపిస్తూ నిఖత్ ముందుకు సాగింది.
Read Also: కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య బంధం బయటపడింది: తరుణ్ చుగ్
Follow us on: Google News, Koo, Twitter