IPL Auction | ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) నెలకొల్పిన రికార్డు ఎంతోసేపు నిలవలేదు. కమిన్స్ రికార్డును ఆసీస్ జట్టుకే చెందిన స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అధిగమించాడు. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కేకేఆర్ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి కళ్లు చెదిరేలా రూ.24.75 కోట్లు వెచ్చించి కేకేఆర్(KKR) సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. రూ.20కోట్లకు పైగా ధర పలికిన ఆటగాళ్లు ఇద్దరూ ఆస్ట్రేలియా ప్లేయర్లు కావడమే విశేషం.
IPL Auction | ఇక శ్రీలంక ప్లేయర్ దిల్షాన్ మధుశంకను రూ.4.6 కోట్లతో ముంబయి ఇండియన్స్(Mumbai Indians) కొనుగోలు చేసింది. టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను రూ.5.8 కోట్లతో గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను రూ.11.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇంగ్లాండ్ పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 4.2 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. యువ బౌలర్ శివమ్ మావిని రూ. 6.4 కోట్లు వెచ్చించి లక్నో తీసుకుంది.