Shami |‘మంజ్రేకర్ బాబాకు జయము’.. షమి చురకలు..

-

ఐపీఎల్ మెగా వేలంలో తన ధర తగ్గొచ్చంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై భారత బౌలర్ షమి(Shami) సెటైర్లు వేశాడు. మంజ్రేకర్ బాబాకు జయము అంటూ చురకలంటించారు. భవిష్యత్తు కోసం కొంత జ్ఞానాన్ని దాచుకోండంటూ ఎద్దేవా చేశాడు షమి. ప్రస్తుతం షమి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే 2025 ఐపీఎల్‌ దగ్గరపడుతున్న క్రమంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans).. షమిని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ 34ఏళ్ల ఆటగాడు ఐపీఎల్ మెగా వేలంలో(IPL Auction) నిలబడ్డాడు. దీనిపై స్పందించిన మంజ్రరేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

‘‘షమిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ షమి గాయం.. దాని కోలుకోవడానికి అతడు తీసుకున్న సమయం ఫ్రాంచైజీలను కాస్తంత వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. ఏదైనా ఫ్రాంఛైజీ భారీ ధరకు షమిని కొనుగోలుచేసినప్పుడు సీజన్ మధ్యలో ఏదైనా గాయమై అతడు దూరమైతే ప్రత్యామ్నాలు పెద్దగా ఉండవు. ఇది షమి ధర తగ్గడానికి కారణం కావొచ్చు’’ అని మంజ్రేకర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మంజ్రేకర్(Sanjay Manjrekar) అభిప్రాయాన్ని విన్న షమి.. ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ‘‘బాబాకు జయము జయము. భవిష్యత్తు కోసం కొంచెం జ్ఞానాన్ని దాచుకోండి సంజయ్ సాబ్. ఎవరికైనా తమ భవిష్యత్తు తెలుసుకోవాలని అనిపిస్తే ఈ సార్‌ను కలవండి’’ అంటూ షమి చురకలంటించాడు. మంజ్రేకర్‌పై షమి(Shami) సంధించి ఈ వ్యంగ్యాస్త్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై మంజ్రేకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read Also: Amaran టీమ్‌పై రూ.1కోటి నష్టపరిహారం.. నోటీసులిచ్చిన విద్యార్థి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...