T20 world cup :క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ (T20 world cup) ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమయ్యింది. మెుత్తం 16 టీమ్‌లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్‌లోనే శ్రీలంక జట్టుతో నమీబియా తలపడింది. ఆదివారం నుంచి తొలి రౌండ్ అర్హత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సూపర్ 12లో చోటు దక్కించుకోవటం కోసం మెుత్తం ఎనిమిది టీమ్‌లు పోటీపడనుండగా.. గ్రూప్-ఏ నుంచి ఆదివారం నమీబియా, శ్రీలంక జట్టులు తలపడ్డాయి. మెుదటగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెుదట నమీబియా ఆటగాళ్లు తడపడ్డారు. దీంతో శ్రీలంకదే మ్యాచ్ అన్న రీతిలో ఉన్న ఆటను.. జన్ ఫ్రైలింక్ 28 బంతుల్లో 44 పరుగులు, జొనాథన్ స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు సాధించటంతో, మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మ్యాచ్ చివరకు వచ్చేసరికి మెుత్తం 7 వికెట్లు కోల్పోయి, 163 పరుగులు స్కోర్‌గా శ్రీలంక ముందు ఉంచారు. లక్ష్య చేధనకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు.. నమీబియా బౌలర్స్ ధాటికి విలవిల్లాడారు. పాథుమ్ నిస్సాంక(9), కుశాల్ మెండిస్ (6), ధనుంజ. డిసిల్వా (12), ధనుష్క గుణతిలక (0) భానుక రాజపక్స(20) కెప్టెన్ దసున్ షనక (29), వనిందు హసరంగ (4) చమిక కరుణరత్నే(5) ప్రమోద్ మధుషన్ (0), దుష్మంత చమీర (8) పరుగులతోనే ఆగిపోయారు. దీంతో కేవలం 108 పరుగులకే శ్రీలంక జట్టు కుప్పకూలింది. 55 పరుగుల తేడాతో నమీబియా ఘన విజయం సాధించి టీ 20లో ఖాతా తెరిచింది.