Isabella Centasso | కోహ్లీకి మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్ విషెస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

-

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు కోహ్లీ(Virat Kohli) 36వ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. ప్రముఖులు, అభిమానులు, సెలబ్రిటీల నుంచి కూడా కోహ్లీ విషెస్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటలీకి చెందిన మహిళా ఫుట్‌‌బాల్ ప్లేయర్ ఇసబెల్లా సెంటాస్సో(Isabella Centasso) కూడా విరాట్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది. ఇప్పుడు ఇదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇటలీలోని ఓ అభిమాని నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ ఇసబెల్లా చెప్పిన విషెస్‌పై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొందరు ఇసబెల్లాపై విమర్శలు చేస్తున్నారు. వీటిపై కూడా తాజాగా ఇసబెల్లా ఘాటుగా స్పందించింది. వాళ్ల విమర్శలను అసలు తాను ఖాతరు చేయనని చెప్పకనే చెప్పింది.

- Advertisement -

‘‘నేను క్రికెట్ లేదా విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ఇలానే జరుగుతోంది. మీరంతా ఎందుకు ఇలా తప్పుగా కామెంట్ చేస్తున్నారు. నిజాయితీగా చెప్తున్నా మీరలా ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నమస్తే’’ అంటూ ఘాటుగా మరో పోస్ట్ పెట్టింది ఇసబెల్లా(Isabella Centasso).

Read Also: శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్.. ప్రకటించిన కేంద్రమంత్రి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...