ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది కివీస్ జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిల్యాండ్(New Zealand) నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. ఆరంభంలోనే 20 పరుగుల వద్ద ఓపెనర్‌ను కోల్పోయింది.
Champions Trophy | దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ బవూమా(Temba Bavuma), వండర్ సన్ తీసుకున్నారు. వికెట్ పడకుండా వీరు 105 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. వీరిలో బావుమా 56 పరుగులు, వండర్ సన్ 69 పరుగులు చేశారు. వారు అంత కష్టపడినా వారు చేసిన పరుగులు జట్టును విజయం వైపు తీసుకెళ్లడంలో ఆశించిన పాత్ర పోషించలేకపోయాయి. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లో కోల్పోయి 312 పరుగులకే పరిమితమైనంది దక్షిణాఫ్రికా(South Africa). దీంతో మార్చి 9న దుబాయ్ వేదికగా జరిగే ఫనల్స్ టీమిండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.