ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్(Nicholas Pooran) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే 6 సిక్సులు, 3ఫోర్లతో అర్థసెంచరీ పూర్తిచేశాడు. దీంతో ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు చైన్నై ఆటగాడు అజింక్యా రహానే(Ajinkya Rahane) 19బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. కాగా మొత్తం ఐపీఎల్ సీజన్లో పూరన్ రెండో వేగవంతమైన అర్థసెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ కేవలం 14బంతుల్లోనే 50పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నారు. యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్ కూడా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు వారి సరసన పూరన్(Nicholas Pooran) చేరాడు. కాగా ఈ మ్యాచులో ఆర్సీబీపై లక్నో జట్టు విజయం సాధించింది.
Read Also: MS ధోనీపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్
Follow us on: Google News, Koo, Twitter