Olympic | స్టార్ జిమ్నాస్టిక్ అథ్లెట్ మియాటా షోకోపై జపాన్ దేశం వేటు వేసింది. మహిళా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షోకో.. స్మోకింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో జపాన్ ఒలిపింక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను జట్టు నుంచి తొలగించినట్లు ప్రకటించారు. జట్టు ట్రైనింగ్ క్యాంప్ సమయంలో ఆమె ఈ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కేవలం స్మోకింగ్ చేయడమే కాకుండా మద్యాన్ని కూడా సేవించినట్లు తేలినట్లు చెప్పారు. దీంతో షోకో లేకుండానే జపాన్ జట్టు ఒలింపిక్స్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
Olympic | సాధారణంగా ఐదుగురు అథ్లెట్ల్స్‌తో జట్టు ఒలింపిక్స్ బరిలో నిలుస్తుంది. కానీ ఇప్పుడు షోకోపై వేటు వేయడంతో మిగిలిన నలుగురు ఆటగాళ్లతోనే తమ జట్టు ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టనుందని జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్(JGA) వెల్లడించింది. ఈ సందర్భంగానే దేశ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పింది. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ‘‘తమ జట్టు కెప్టెనే స్మోకింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడం పట్లు ప్రజలను క్షమాపణలు కోరుతున్నాం. నలుగురు క్రీడాకారులతోనే బరిలోకి దిగుతున్నప్పటికీ మన జట్టు తప్పకుండా మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని జేజీఏ పేర్కొంది. ఇదిలా ఉంటే జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ప్యారిస్ వేదికగా ఒలిపింక్స్ 2024 పోటీలు ప్రారంభం కానున్నాయి.