P T Usha nominated to rajyasabha vice chairman’s panel: పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలె ఆమె రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు మరో కీలక పదవి లభించింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ గా పీటీ ఉష నియమితులైనట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ మంగళవారం సభలో వెల్లడించారు. డిసెంబర్ 19 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టుగా చెప్పారు. పీతి ఉష కు సభలోని ఎంపీలు అభినందనలు తెలిపారు. అయితే రాజ్యసభకు తొలిసారిగా నామినేట్ అయిన పీటీ ఉషకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల ఆమె సన్నిహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.