చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటించిన ప్రైజ్ మనీ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అవాక్కుకు గురిచేస్తోంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య గెలిచినందుకు గానూ ఒక్కో ఆటగాడికి వంద డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు పీహెచ్ఎఫ్ ప్రకటించింది. అంత గెలిచి.. అంతటి ఆటతీరును కనబరిస్తే వంద డాలర్ల ప్రైజ్ మనీతో చేతులు దులుపుకుంటుందా అని అందరూ అవాక్కవుతున్నారు. వంద యూఎస్ డాలర్ల అంటే పాకిస్థాన్ రూపాయల్లో 27 వేల 818 రూపాయలన్న మాట. ఇంత గెలిస్తే మంచి ప్రైజ్ మనీ కూడా లేకపోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి పాకిస్థాన్ లాహోర్‌కు ఫ్లైట్‌లో రావడానికి తక్కువలో తక్కువగా సుమారు రూ.50,411(పాకిస్థాన్ రూపాయలు) ఖర్చు అవుతుందని, ఆ టికెట్ వెల కూడా ప్రైజ్ మనీ లేకుంటే ఎలా అని నెటిజన్స్ షాకవుతున్నారు. పీహెచ్‌పీఎఫ్ ఏమంటోందంటే..
Asian Championship | ‘‘పాకిస్థాన్ హాకీ జట్టు చేసిన ప్రదర్శనను ప్రోత్సహిస్తూ వంద డాలర్లు బహుమతిగా ఇచ్చాం. టోర్నీలో గాయపడిన అబూ బకర్ మహ్మద్ కోలుకునే వరకు పీహెచ్ఎఫ్ బాధ్యత తీసుకుంటుంది. దాంతో పాటుగా మ్యాచ్ సమయంలో ఘజన్‌ఫర్ తన తండ్రి మరణించినా.. ఈవెంట్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అతడికి ఈ కాంస్య పతకం అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అని తెలిపింది. ఈ క్రమంలో ఇంత చేసిన జట్టుకు సరైన గౌరవం మాత్రం దక్కడం లేదని చాలా మంది పీహెచ్‌ఎఫ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.