PV Sindhu | మళ్ళీ నిరాశ పరిచిన పీవీ సింధు.. ప్రీక్వార్టర్స్‌లో ఇంటి బాట..

-

చైనా మాస్టర్స్(China Masters) ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు(PV Sindhu) మరోసారి నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్ ప్లేయర్ యెవో జియా మిన్‌(Yeo Jia Min)తో తలపడిన సింధు ఘోర ఓటమితో ఇంటి బాట పట్టింది. ఆ మ్యాచ్‌లో 16-21, 21-17, 21-23 తేడాతో సింధు పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటి వరకు వీరిద్దరూ ఐదు సార్లు తలపడగా యెవో విజయం సాధించడం ఇదే తొలిసారి. మిగిలిన నాలుగు సార్లు కూడా సింధు గెలిచింది. చైనా ట్రోఫీ ప్రీక్వార్టర్స్‌లో వీరి మధ్య మ్చాచ్ 69 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో తొలి రెండు గేమ్‌లను సింధు, యెవో చెరొకటి గెలిచారు. మూడో గేమ్ వీరి మధ్య హోరాహోరీగా సాగింది. మూడో గేమ్‌లో ఒకానొక సమయంలో సింధు 13-9తో ఆధిక్యం కనబరిచింది. కానీ పట్టు వదలని యెవో.. సింధును అద్భుతంగా అడ్డుకోవడమే కాకుండా వరుసగా ఆరు పాయింట్లు స్కోర్ చేసి 15-13తో ఆధిక్యం అందుకుంది.

- Advertisement -

వెంటనే పుంజుకున్న సింధు(PV Sindhu).. స్కోరును 21-21గా సమం చేసింది. అప్పటి వరకు కూడా గేమ్ నువ్వా నేనా అన్న రేంజ్‌లో అత్యం ఉత్కంఠ భరితంగా కొనసాగింది. కానీ చివరి నిమిషంలో యెవో వరుసా రెండు పాయింట్లు సాధించి విజయాన్ని నమోదు చేసేసింది. మిగతా మ్యాచ్‌లలో అనుపమ ఉపాధ్యాయ 7-21, 14-21తో జపాన్‌కు చెందిన నత్సుకి నిదైరా చేతిలో, మాళవిక బాన్సోద్ 9-21, 9-21తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద చేతిలో ఓటమిని చవి చూశారు. మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 16-21, 11-21తో చైనా జోడీ షెంగ్ ఝ, టాన్ నింగ్ జంట చేతిలో ఓటమి పాలయింది.

Read Also: డెన్మార్క్‌కు దడ పుట్టించిన లక్ష్యసేన్.. క్వార్టర్స్‌లో స్థానం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...