ఐపీఎల్ 17 విన్నర్ కోల్‌కతా నైట్ రైడట్స్ ఫ్రాంఛైజీకి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇన్నాళ్లూ కేకేఆర్ మెంటార్(KKR Mentor)గా పనిచేసిన గౌతమ్ గంభీర్ తాజాగా టీమిండియాకు హెడ్‌కోచ్‌గా మారడంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయి. గంభీర్‌తో పాటు కేకేఆర్ సహాయక కోచ్‌లు అభిషేక్ నాయర్, రైన్ టెన్ దస్కటే కూడా టీమిండియా కోచ్‌లుగా వచ్చేశారు. కేకేఆర్ కోచింట్ టీమ్ ఖాళీ అయింది. దీంతో కొత్త మెంటార్‌తో పాటు కోచింగ్ టీమ్‌ను కూడా ఎంచుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో పడింది కేకేఆర్. ఇప్పటికే లక్నో, రాజస్థాన్ జట్లు తమ కొత్త మెంటార్‌ను ప్రకటించేశాయి. దీంతో కేకేఆర్ కూడా త్వరపడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే ఈ రేస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting), శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(Sangakkara) ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రేసులో మరో స్టార్ ఆల్‌రౌండర్ పేరు కూడా వినిపిస్తోంది. అతడే జాక్వెస్ కలిస్(Jacques kallis).
ఆల్‌రౌండర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించిన జాక్వెస్ కలిస్.. గతంలో కేకేఆర్‌కు ఆడాడు. ఇప్పుడు జట్టు మెంటార్‌గా అతడిని నియమించుకోవాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపుతోందని సమాచారం. కలిస్.. 2015లోనే ఆటగాడి నుంచి ప్రధాన కోచ్‌గా మారిపోయాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ కప్పు సాధించిన 2012, 2014 టోర్నీల్లో కలిస్ ఆడాడు. ఇప్పుడు కేకేఆర్ మెంటార్(KKR Mentor) అవ్వడానికి కలిస్ ఆసక్తి చూపుతున్నాడట. మరి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ కమ్ హెడ్ కోచ్‌గా వీరి ముగ్గురు దిగ్గజాల్లో ఎవరు ఎంపకవుతారో చూడాలి.