దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై సీనియర్ ప్లేయర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీమిండియా ఫాలో అవుతున్న బ్యాటింగ్ ఆర్డర్‌తో బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh)కు న్యాయం చేస్తున్నామా అని ఆయన ప్రశ్నించారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో రింకు సింగ్ ఆరోస్థానంలో బ్యాంటింగ్‌కు రానున్నాడు. ఈ సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో రింకు సింగ్ ఆరోస్థానంలో మైదానంలోకి అడుగు పెట్టాడు. ఈ విషయంపైనే తాజాగా ఆకాశ్ చోప్రా తీవ్ర అసంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రింకు సింగ్ టాలెంట్‌ను టీమిండియా సరిగా వినియోగించుకోలేకపోతోందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా భారత జట్టులో రింకూ సింగ్ స్థానంపై పలు ప్రశ్నలు సంధించాడు.
‘‘మనం రింకూ(Rinku Singh)కు న్యాయం చేస్తున్నామా? ఈ ప్రశ్న అడగడానికి బలమైన కారణమే ఉంది. అతడిని జట్టులోకి తీసుకుని బంగ్లాదేశ్(Bangladesh)పై ఆడించారు. టాప్ ఆర్డర్, పవర్ ప్లే ఇలా ఎప్పుడు పంపినా రింకూ సింగ్ మంచి పరుగులనే నమోదు చేశాడు. ప్రతి సారీ కూడా మంచి స్ట్రైక్ రేట్‌తో అర్థశతకం బాదుతూనే వచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అడ్డుగా నిల్చుని ఆదుకున్నాడు. అలాంటి రింకూ సింగ్‌ను దక్షిణాఫ్రికాతో జరుగుతున్న జట్టులో నాలుగో స్థానంలో ఎందుకు పంపకూడదు? తొలి టీ20లో రింకూను ఆరో స్థానంలో పంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రింకూ ఫినిషర్ మాత్రమే కాదు. గేమ్‌ను ఎలా మలుపు తిప్పాలో రింకూకు బాగా తెలుసు. భారీ షాట్స్ కూడా కొట్టగలడు’’ అని ఆకాష్ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.