Rishabh Pant Injured In Car Accident: ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు డివైడర్ ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ నుంచి తన బెంజ్ కారులో ఢిల్లీ వెళ్తున్నారు రిషబ్. కారు రూర్కీ సమీపంలోకి రాగానే డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జవడమే కాదు మంటలు కూడా చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో రిషబ్ ఒక్కరే ఉన్నారని, ఆయనే కారు నడుపుతున్నారని తెలిసింది. ఈ దుర్ఘటనలో రిషబ్ తీవ్ర గాయాలపాలయ్యారు. తలకి, వీపుకి బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. దగ్ధమైన కారు
-