World Cup 2023 | స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత ఐపీఎల్‌కు ముందు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్‌కు దూరమైన పంత్.. వన్డే వరల్డ్ కప్‌కు కూడా దూరమైనట్లు తెలుస్తోంది. తాజాగా.. ప్రపంచ కప్ 2023 కోసం జట్ల పేర్లను ఖరారు చేయడానికి ఐసీసీ చివరి తేదీని ప్రకటించింది. ప్రపంచ కప్ 2023 కోసం అన్ని దేశాలు తమ ఆటగాళ్ల జాబితాను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 మధ్య సమర్పించవచ్చని పేర్కొంది.
World Cup 2023 | అయితే, ఈ గడువులోగా ఐసీసీకి ఇచ్చే జాబితాలో రిషబ్ పంత్ పేరు ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో సెలక్టర్ల దృష్టి కేఎల్ రాహుల్‌పై పడింది. ఈ క్రమంలోనే రాహుల్ సైతం గాయం నుంచి కోలుకోవడంతో మార్గం సుగమం అయింది. ఆసియా కప్ నుంచి కేఎల్ రాహుల్(KL Rahul) పునరాగమనం చేస్తాడని విశ్వసిస్తున్నారు. ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. రిషబ్ పంత్ ప్రపంచకప్ వరకు ఫిట్‌గా ఉండడని దాదాపుగా తేలిపోయిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.