ఇక సౌరవ్‌ గంగూలీకి ఛాన్స్‌ లేనట్లే..!

-

తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అన్న సందేహానికి తెరదించినట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం ఈనెల 23తో ముగియనుంది. ఈ క్రమంలో రెండోసారి కూడా గంగూలీయే మరోసారి పగ్గాలు చేపడతాడని అనుకున్నారు. కానీ లోధా కమిటీ సిఫార్సుల మేరకు రెండు పర్యాయాలు బీసీసీఐలోని ఏ పదవిలోనూ ఉండేందుకు వీలు లేదు. ఈ విషయంపై ఇటీవల కాలంలో సుప్రీంను ఆశ్రయించిన బీసీసీఐ, అనుకూల తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే రెండోసారి దాదా అధ్యక్షుడిగా కొనసాగుతారనీ లేకపోతే, ఇప్పటి వరకూ బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రోజర్‌ బిన్నీ పేరు తెరమీదకు వచ్చింది. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీయే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

రోజర్‌ బిన్నీ 1979-87 మధ్య భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 27 టెస్టుల్లో 830 పరుగులతో పాటు 72 వన్డేల్లో 629 పరుగులు చేశారు. అంతేగాకుండా గతంలో బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌గా కూడా పని చేసిన అనుభవం ఉంది. కాగా రోజర్‌ బిన్నీ కొడుకు స్టువర్ట్‌ బిన్నీ కూడా భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ, అతడి తండ్రి సెలక్టర్‌గా ఉన్న సయంలో భారత జట్టుకు ఎంపిక కావటంతో అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. టీమిండియా జట్టులోకి ఆల్‌ రౌండర్‌గా వచ్చిన స్టువర్ట్‌ బిన్నీ తన స్థానాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...