Ronaldo: రొనాల్డోకు గుడ్‌బై చెప్పేసిన మాంచెస్టర్‌ యునైటెడ్‌

-

Ronaldo expell from Manchester United: ఫిఫా ప్రపంచకప్‌ 2022 మెుదలయ్యింది.. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు మెుదలయ్యాయి. ఫుట్‌బాల్‌ సమరం ప్రారంభం అయితే ఎటువంటి మిరాకల్స్‌ జరగుతాయో, ఎన్ని రికార్డులు బద్దలవుతాయో, ఇంకెన్ని కొత్త అద్భుత రికార్డులు ఆవిష్కృతమవుతాయోనని ఉత్సాహంతో చూస్తుంటారు. మరి ముఖ్యంగా స్టార్‌ ఆటగాళ్లపైనే అందరి గురి ఉంటుంది. ఇటువంటి సమయంలో, పోర్చగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో బంధం తెంచేసుకున్నట్లు మాంచెస్టర్‌ యునైటెడ్‌ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

పరస్పర అంగీకారంతోనే రొనాల్డోకు గుడ్‌బై చెప్పినట్లు క్లబ్‌ వెల్లడించింది. కాగా, ఫిఫా ప్రపంచకప్‌ 2022లో భాగంగా మరో రెండు రోజుల్లో రొనాల్డో తన తొలి మ్యాచ్‌ను ఆడనున్న నేపథ్యంలో ఇటువంటి ప్రకటన వెలువడటంపై ఫుట్‌బాల్‌ క్రీడా లోకంతో పాటు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. దాదాపు 14 ఏళ్ల తరువాత 2021లో మాంచెస్టర్‌ క్లబ్‌లోకి రొనాల్డో పునఃప్రవేశం చేసిన రొనాల్డో, కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఆడాడు. పోర్చుగల్‌ సీనియర్‌ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో, అదే సంవత్సరం నుంచి క్లబ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ఆడిన అనంతరం, రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్‌ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.

గతవారం ఓ టాక్‌షో పాల్గొన్న రొనాల్డో, మాంచెస్టర్‌ క్లబ్‌పైనా, క్లబ్‌ మేనేజర్‌, మాజీ సహచరులపై తీవ్రమైన ఆరోపణలు చేయటంతోనే, మాంచెస్టర్‌ క్లబ్‌ నుంచి రొనాల్డోను తొలగించిందని వార్తలను వెలువడుతున్నాయి. “క్లబ్‌ నాకు ద్రోహం చేసింది. మేనేజర్‌ ఇరిక్‌ హ్యాగ్‌ పట్ల నాకు గౌరవం లేదు. క్లబ్‌ యాజమాన్యం ఫలితాలు కాకుండా, కేవలం ధనార్జనే లక్ష్యంగా ఉంది” అని రొనాల్డో (Ronaldo) ఆరోపించాడు. అంతేగాకుండా మాజీ సహచరులైన గ్వారీ నెవిల్లె, వ్యాన్‌ రూనీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...