మాస్టర్ బ్లాస్టర్, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin) ముంబై పోలీసులను ఆశ్రయించారు. కొన్ని యాడ్ కంపెనీలు, వెబ్ సైట్స్ అనుమతి లేకుండా ఫోటో, వాయిస్ తో వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నారని ఫిర్యాదుచేశారు. తన పేరును అక్రమంగా ఉపయోగించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సచిన్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 426, 465 మరియు 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్స్ రూపొందించిన వారిపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా సోషల్ మీడియాలో ఒక చమురు కంపెనీ ప్రమోషన్ కోసం టెండూల్కర్ చిత్రాన్ని ఉపయోగించినట్లు సచిన్ వ్యక్తిగత సహాయకుడు గుర్తించారు.
- Advertisement -
Read Also: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న బండ్ల గణేశ్
Follow us on: Google News, Koo, Twitter