Virat Kohli | సాగర తీరంలో కోహ్లీ సైకత శిల్పం.. ఈ స్పెషల్ డే సందర్భంగానే..

-

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈరోజు తన 36వ పుట్టినరోజున జరుపుకుంటున్నాడు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా దేశ్యాప్తంగా అతడి అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని కోహ్లీకి తన స్టైల్లో బర్త్ డే విషెస్ చెప్పాడు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్.. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సైకత శిల్పం నిర్మించాడు. తన అద్భుతమైన స్కిల్స్‌తో సుదర్శన్(Sand Artist Sudarsan).. కోహ్లీ అభిమానులను మరింత ఖుష్ చేశాడు. కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో కోహ్లీ సైకత శిల్పాన్ని తయారు చేశాడు. 5 అడుగుల ఈ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో ఈ శిల్పాన్ని రూపొందించాడు సుదర్శన్. దీనికి సంబంధించి ఫోటోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

- Advertisement -

‘‘ఇవాళ విరాట్ కోహ్లీ 36వ బర్త్ డే. అతడి కోసం ప్రత్యేకంగా సైకత శిల్పం తయారు చేశాం. ఆర్టిస్ట్‌గా కోహ్లీ పుట్టిన రోజు వేడులకు ఇలా చేసుకున్నాం’’ అని సుదర్శన్ పోస్ట్ పెట్టాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి 16 ఏళ్ల కిందట అడుగు పెడ్డిన కోహ్లీ.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగా ప్రపంచ‌ంలోని అత్యుత్తమ ఆటగాళ్ల సరసన నిలిచాడు. కోహ్లీకి కేవలం భారత్‌లోనే కాకుండా పలు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. తన కెరీర్‌లో ఇప్పటికే కోహ్లీ ఎన్నో రికార్డ్‌లు చేశాడు. కోహ్లీ(Virat Kohli)ని సీనియర్లు సైతం వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని పలు సందర్భాల్లో కొనియాడారు.

Read Also: చాయిస్ ఈజ్ యువర్స్.. సల్మాన్‌ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...