Sanju Samson | డర్బన్‌లో దంచికొట్టిన సంజు.. పటాపంచలైన అనుమానాలు..

-

డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో సంజు శాంసన్(Sanju Samson) వీరవిహారం చేశాడు. ఆడతాడో ఆడడో.. ఆడితే ఏమాత్రం ఆడతాడో అని అనుకుంటున్న అభిమానుల అనుమానాలను పటాపంచలు చేశాడు సంజు. ఈ టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సంజు కీలకంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సంజు 50 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, పది సిక్స్‌లు బాది దక్షిణాఫ్రికా బౌలర్ల చెడుగుడు ఆడేశాడు. సంజు(Sanju Samson)తో పాటు ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ(Tilak Varma) కూడా అద్భుతంగా రాణించాడు. 18 బంతుల్లో 33 పరుగులు చేసి టీమిండియా పేస్‌ను కొనసాగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

- Advertisement -

203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మాత్రం 141 పరుగులకే తేలిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3/25, రవి బిష్ణోయ్ 3/28 తో అదరగొట్టారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా జట్టులో 25 పరుగులతో క్లాసెస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఈ విషయంలో దక్షిణాఫ్రికాతో జరిగే 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

Read Also: హైదరాబాద్‌లో సల్మాన్.. వాళ్లందరినీ చెక్ చేయాల్సిందే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...