ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో సర్ఫరాజ్(Sarfaraz Khan)కు స్థానం దక్కుతుందా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. చాలా కష్టమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో ఒక కారణం చెప్పి తుది జట్టులో సర్ఫరాజ్ స్థానం లేకుండా చేస్తారని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై సీనియర్ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత ఇంగ్లండ్‌పై అర్థశతకాలతో విరుచుకుపడిన సర్ఫరాజ్ ఆ తర్వాత కివీస్‌ను తన శతకంతో కీచుపనిపించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనకు సర్ఫరాజ్‌ను తప్పకుండా పంపాలని అభిమానుల నుంచి డిమాండ్లు పెరుగుతుండగా.. తాజాగా ఆకాష్ చోప్రా కూడా ఇదే డిమాండ్ చేశాడు. విదేశీ పిచ్‌లపై అనుభవం రావాలంటే విదేశీ పర్యటనలకు పంపాలని, ఇంట్లోనే కూర్చోబెట్టి అనుభవం రావాలి, అదరగొట్టాలంటే ఎలా కుదురుతుంది? అని ఆకాష్ ప్రశ్నించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత్-ఆసిస్.. ఐదు టెస్టుల సిరీస్‌తో బాహాబాహీ కానున్నాయి. ఇది యువ క్రికెటర్లకు మంచి అవకాశమని, ఇందులో సర్ఫరాజ్‌కు అవకాశం కల్పింతే మరింత షైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆకాష్ తన ఆశలను బహిర్గతం చేశాడు.
‘‘ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. కాగా ఈ సిరీస్‌కు వెళ్లే స్క్వాడ్‌లోనే కాకుండా తుది జట్టులో కూడా సర్ఫరాజ్‌కు స్థానం కల్పించాలి. ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారి భారీ టెస్ట్ సిరీస్ ఆడనుంది. సర్ఫరాజ్(Sarfaraz Khan) ఎక్కడైనా రాణిస్తాడన్న నమ్మకం నాకుంది. అతడిని పక్కనబెట్టడానికి కారణం ఒక్కటి కూడా కనిపించడం లేదు. కాబట్టి కంగారూలను కంగారు పెట్టే జట్టులో సర్ఫర్ తప్పకుండా ఉంటాడని నేను భావిస్తున్నా. మరి సెలక్టర్లు ఏం చేస్తారో చూడాలి’’ అని అన్నాడు. మరి చూడాలి ఆసీస్‌తో తలపడే తుది జట్టులో సర్ఫరాజ్‌కు స్థానం దక్కుతుందా లేదా అనేది.