న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz khan).. ప్రత్యర్థి బౌలర్ల దుమ్ముదులిపేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మైదానంలో అడుగు పెట్టిన సర్ఫరాజ్ సెంచరీ చేసిన టీమిండియాను గట్టెక్కించేశాడు. వర్షంతో రెండు రోజులు ఆలస్యమైన టెస్ట్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్‌ను అధిగమించిన భారత్.. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు టార్గెట్ పెట్టే ప్రయత్నంలో ఉంది. సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడాల్సిన సర్ఫరాజ్.. ఈ మ్యాచ్‌లో సుభ్‌మన్ గిల్ లేకపోవడంతో సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన సర్ఫరాజ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో చెలరేగాడు. 110 బంతుల్లో సర్ఫరాజ్ సెంచరీ పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఈ సెంచరీతో..ఒకే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై రెండో ఇన్నింగ్స్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో సర్ఫరాజ్(Sarfaraz khan) కూడా నిలిచాడు. ఈ లిస్ట్‌లో సర్ఫరాజ్‌ది తొమ్మిదో స్థానం. తొలి స్థానంలో మాధవ్ ఆప్టే.. వెస్టిండీస్‌పై తొలుత డకౌటై రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేశాడు. ఇదే విధంగా ఈ లిస్ట్‌లో గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌గిల్ వరుసగా ఉన్నారు.