చైనా మాస్టర్స్(China Masters) ప్రపంచ టూర్ సూపర్ 750లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. మహిళల వైపు నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోయినా పురుషులు మాత్రం అదరగొట్టేస్తున్నారు. సింగిల్స్, డబుల్స్ అన్న తేడా లేకుండా ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)-చిరాగ్ శెట్టి(Chirag Shetty) సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ రస్‌ముసెన్ జోడీని చిత్తు చేసింది.
China Masters | ఈ మ్యాచ్‌లో 21-16, 21-19 తేడాతో భారత జోడీ విజయం సాధించింది. 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది సాయిరాజ్ జోడీ. పరుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు లక్షసేన్(Lakshya Sen)కు చుక్కెదురైంది. క్వార్టర్స్‌లో డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంథోన్సెన్‌తో తలపడిన లక్షసేన్ 18-21, 15-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.