స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..ఇకపై ఆటకు గుడ్ బై!

0
97

ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం డర్హమ్​లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్​ తనకు చివరిదని తెలిపాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని అందుకే, వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్టోక్స్ తెలిపాడు.

అయితే వన్డే ఆడకపోయిన ఇకపై నుంటి టీ20, టెస్టుపైనే పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.  ఈ నిర్ణయం ఎంతో కఠినమైనది. నా తోటి ప్లేయర్స్​తో ఆడిన ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించా. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది.” అని అన్నాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇటీవల అతడు టీమ్‌ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.  ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన స్టోక్స్‌ 2919 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఇటీవలే స్టోక్స్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పగ్గాలు చేపట్టిన అతను.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. అతని సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు క్లీన్‌ స్వీప్‌ చేసింది. 9 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ ఈ ఘనత సాధించింది.